¡Sorpréndeme!

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP Desam

2025-04-25 2 Dailymotion

ఈ రోజు గెలుపు కోసం రెండు టీమ్స్ పోరాడనున్నాయి. గెలిస్తే ప్లే ఆఫ్స్ కోసం పోరాట యాత్ర మొదలు పెట్టాలి. ఓడిన వాళ్లను రారమ్మని పిలవటానికి ఆఖరి స్థానం ఎలాగో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం చెన్నై ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో SRH ఫ్యాన్స్ కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు జట్లే ఇప్పటి వరకూ పాయింట్స టేబుల్ లో 9,10 స్థానాల్లో ఉన్నాయి. రెండు టీమ్స్ ఈ లీగ్ లో రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి నాలుగేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టుకోవాలంటే ఈ రెండు జట్లు కూడా తమ ముందున్న ఆరు కు ఆరు మ్యాచులు గెలిస్తేనే సాధ్యం అవుతుంది. గతేడాది ఆర్సీబీ ఇలానే మొదట్లో ఓడిపోయి చివర్లో ఏడు మ్యాచ్ లకు గానూ ఆరు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్స్ కి దూసుకెళ్లింది. అందుకని ఈ రోజు గెలిచిన జట్టు లీగ్ లో ముందు అడుగు వేస్తోంది. కనీసం ప్లే ఆఫ్స్ కోసం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఓడిన జట్టు మాత్రం ఆఖరి స్థానాన్ని మరితం పదిలం చేసుకుని ప్లే ఆఫ్స్ దాదాపుగా కరిగిపోవటం ఖాయం. ధోనీ ఇప్పటికే చేతులెత్తేసినట్లు మాట్లాడాడు. సరైన కాంబినేషన్స్ సెట్ చేసుకుని నెక్ట్స్ ఇయర్ కోసం ఫైనల్ 11 తయారు చేసుకునే పనిలో ఉన్నామన్నాడు. సో యంగ్ స్టర్స్ అయిన రషీద్, ఆయుష్ మాత్రమే ఈ మ్యాచ్ లో కూడా ఆడతారనేది పక్కా. పతిరానాను క్లాసెన్ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. సన్ రైజర్స్ లో హెడ్ నుంచి మొదలుపెడితే అనికేత్ అందరూ తోపు ఆటగాళ్లే అయినా మొన్నటి మ్యాచ్ లో ముంబై పై ఘోరంగా విఫలమయ్యారు అంతా. క్లాసెన్, అభినవ్ మనోహర్ ఆ మాత్రమన్నా ఆడకపోయింటే ఆర్సీబీ 49 పరుగుల రికార్డు బద్ధలు అయ్యేది. సో చూడాలి ఈ మ్యాచ్ లోనైనా ఆరెంజ్ ఆర్మీ కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర ప్రారంభిస్తుందా.